ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి : సీపీఐ

ABN, First Publish Date - 2021-10-30T04:55:45+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రవీంద్రనగర్‌), అక్టోబరు 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సాగుపై పెట్టుబడి భారం గణనీయంగా పెరిగిందని, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అతివృష్టి, అనావృష్టితో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎ్‌స.జగన్‌మోహన్‌రెడ్డి రైతు ప్రభుత్వమని చెబుతున్నప్పటికీ రైతులకు ఇచ్చే రాయితీ రుణాలు పూర్తిగా రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎలాంటి మేలు చేకూర్చడం లేదన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, ఎంవీ.సుబ్బారెడ్డి, శివశంకర్‌రెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, మలిశెట్టి రాహుల్‌, రంగారెడ్డి, బాలచంద్రయ్య, మేకల జయన్న, రాజగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T04:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising