ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపర్‌ కింద పడి డ్రైవర్‌ మృతి

ABN, First Publish Date - 2021-01-25T05:46:44+05:30

జువారీ కర్మాగారంలోని లైమ్‌స్టోన మైన్సలో డంపర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుంకిరెడ్డి వాసుదేవరెడ్డి (42) ఆదివారం తెల్లవారుజామున డంపర్‌ కింద మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 18 సంవత్సరాలుగా ఇక్కడ డంపర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి శనివారం రాత్రి నైట్‌ షిప్టులో పనిచేసేందుకు వెళ్లాడు.

డంపర్‌ కింద పడి మృతి చెందిన వాసుదేవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నష్టపరిహారం చెల్లించాలని కార్మికుల ఆందోళన

రూ.32 లక్షలు, ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకారం

ఎర్రగుంట్ల, జనవరి 24: జువారీ కర్మాగారంలోని లైమ్‌స్టోన మైన్సలో డంపర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుంకిరెడ్డి వాసుదేవరెడ్డి (42) ఆదివారం తెల్లవారుజామున డంపర్‌ కింద మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 18 సంవత్సరాలుగా ఇక్కడ డంపర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి శనివారం రాత్రి నైట్‌ షిప్టులో పనిచేసేందుకు వెళ్లాడు. ఆదివారం ఉదయం డంపర్‌ ఒకచోట వాసుదేవరెడ్డి మృతదేహం ఒక చోట పడి ఉండటాన్ని గమనించి కార్మికులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కార్మికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈ విషయంపై యాజమాన్య ప్రతినిధులు సరైన రీతిలో స్పందించకపోవడంతో కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, కార్మిక నాయకుడు ఎంవీ రమణారెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. నష్టపరిహారం తేల్చేవరకు మృతదేహాన్ని కదల్చమని మృతుడి బంధువులు, కార్మికులు ఆందోళన చేయడంతో ఎంవీరమణారెడ్డి యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు.

పది లక్షల నుంచి ప్రారంభమై చివరిగా రూ.32 లక్షలు నగదు, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు సీఐ సదాశివయ్య తెలిపారు. మృతుడి స్వగ్రామమైన పాయసంపల్లెకు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ట్రిపుల్‌ ఐటీలో 1, 2వ సంవత్సరం చదువుతున్న ఇద్దరు కుమారులున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహం వద్ద భార్య, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


మిస్టరీగా మృతి 

డంపర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి మృతి మిస్టరీగా ఉంది. ఆపరేటర్‌గా పనిచేస్తూ అదే డంపర్‌ కింద ఎలా పడ్డాడో అర్థకావడం లేదని కార్మికులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి డంపర్‌ ఆగి ఉన్న ప్రదేశానికి చాలా దూరం ఉంది. వేరే ఎవరైనా డంపర్‌ నడపుతూ వాసుదేవరెడ్డిపై ఎక్కించారా..? ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-25T05:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising