ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కలు చింపేశాయ్‌..!

ABN, First Publish Date - 2021-11-28T05:45:37+05:30

సిబ్బంది నిర్లక్ష్యంతో వీధి కుక్కలు సచివాలయంలోని రికార్డులు, కుర్చీలను చింపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామసముద్రం సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కుక్కలు ఆఫీసులో ఉండడం చూసుకోకుండా శుక్రవారం తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.

కుక్కలతో ధ్వంసమైన ఫర్నీచర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయంలో కుక్కలు

తాళం వేసుకుని వెళ్లిన సిబ్బంది

కుర్చీలు, రికార్డుల ఛిద్రం

బి.కోడూరు, నవంబరు 27: సిబ్బంది నిర్లక్ష్యంతో వీధి కుక్కలు సచివాలయంలోని రికార్డులు, కుర్చీలను చింపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామసముద్రం సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కుక్కలు ఆఫీసులో ఉండడం చూసుకోకుండా శుక్రవారం తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. అవి బయటకు వెళ్లేందుకు వీలులేక రాత్రంతా లోపలే ఉండి రికార్డులను, కుర్చీలను ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ఉమామహేశ్వర్‌రావు గురువారం సచివాలయాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఇందుకు పంచాయతీ సెక్రటరి నాగేంద్ర నిర్లక్ష్య వైఖరి కారణమని తేలుస్తూ అతడికి శనివారం షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆఫీసులో ఉన్న కొత్త ఫర్నీచర్‌, రికార్డులను పంచాయతీ సెక్రటరినే సమకూర్చాలని ఎంపీడీవో తెలిపారు. ఈ విషయమై నాగేంద్రను వివరణ కోరగా తాను రెండు పంచాయతీలకు ఇనచార్జ్‌గా ఉన్నందున సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లేంత వరకు ఆఫీసులో ఉండే అవకాశం లేదని అన్నారు. జరిగిన త ప్పిదమంతా సచివాలయ సిబ్బందిదేనని, ఇందులో తన ప్రమేయం లేదన్నారు.

Updated Date - 2021-11-28T05:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising