ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌంటింగ్‌ను పకడ్బందీగా చేయాలి

ABN, First Publish Date - 2021-10-28T05:17:20+05:30

బద్వేలు ఉప ఎన్నికకు సంబంఽ దించి నవంబరు 2వ తేదీ జరిగే కౌంటింగ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చేయాలని కడప రెవెన్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

మాట్లాడుతున్న ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కలెక్టరేట్‌), అక్టోబరు 27: బద్వేలు ఉప ఎన్నికకు సంబంఽ దించి నవంబరు 2వ తేదీ జరిగే కౌంటింగ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చేయాలని కడప రెవెన్యూ డివిజనల్‌ అధికారి ధర్మచంద్రారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది విధుల నిర్వహణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియలో విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి, కౌంటింగ్‌ సిబ్బంది పాల్లొన్నారు.


తప్పులు లేకుండా ఓటర్ల జాబితా 

కడప నియోజకవర్గంలోని 268 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి ఎలాంటి తప్పులు లేకుండా ప్రత్యేక ఓటర్ల జాబితాను రూపొందించాలని బూత్‌ లెవల్‌ అధికారులను, సూపర్‌వైజర్లను ఆర్డీవో ఆదేశించారు. బుధవారం  కడప అసెంబ్లీకి సంబంధించి నగరంలోని ఓ కల్యాణ మండపంలో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివరామిరెడ్డి, ఎన్నికలల డీటీ రోనాల్డ్‌, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising