ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-01-18T05:34:13+05:30

ప్రధాని మోదీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సదస్సు నిర్వహించారు.

సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగు చట్టాల రద్దు కోసం 26న ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల ర్యాలీలు

సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ

కడప (మారుతీనగర్‌), జనవరి 17: ప్రధాని మోదీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా రామక్రిష్ణ హాజరై మాట్లాడారు. రైతాంగ వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వ్యవసాయరంగం రాషా్ట్రల పరిధిలోని అంశమైనప్పటికీ సాగు ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా సభ్యుల అభ్యంతరాలను లెక్క చేయకుండా మూజువాణి ఓటుతో అడ్డగోలుగా నల్లచట్టాలు తీసుకొచ్చారన్నారు. ఆ చట్టాలు అమలైతే రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించక దోపిడీకి గురవుతారన్నారు. కాగా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మార్ట్‌ కంపెనీలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాషా్ట్రనికి రైతుల నుంచి సేకరించిన పంటను అంతటినీ స్వేచ్ఛగా రవాణా చేసి పరిమితికి మించి పంట నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తారన్నారు. తద్వారా ఇటు రైతులను, అటు వినియోగదారులను పక్కా ప్రణాళికతో దోపిడీ చేసేందుకు అనువుగా రూపకల్పన చేయబడినవే నూతన చట్టాలన్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు ఏకతాటిపై నిలిచి పోరాడుతున్న తీరు అద్వితీయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలాయాపన చేస్తూ ఉద్యమంలో చీలిక తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ఉద్యమం వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉందని ప్రచారం చేయడం సరికాదన్నారు. సాగు చట్టాల రద్దు కోసం అఖిలభారత కిసాన సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 26వ తేదీ ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో జరుపతలపెట్టిన  ర్యాలీని జయప్రదం చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా నాయకుడు ఓబయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిచంద్ర, అధ్యక్షుడు రమణ, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising