తెలుగు, కన్నడ భాషల బంధం అపూర్వమైనది
ABN, First Publish Date - 2021-10-30T04:57:57+05:30
తెలుగు, కన్నడ భాషల బంధం అపూర్వమైనదని వీసీ సూర్యకళావతి అన్నారు. తెలుగు, కన్నడ భాషల సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనే అంశంపై కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సభ శుక్రవారం జరిగింది.
వైవీయూ వీసీ సూర్యకళావతి
కడప(వైవీయూ), అక్టోబరు 29: తెలుగు, కన్నడ భాషల బంధం అపూర్వమైనదని వీసీ సూర్యకళావతి అన్నారు. తెలుగు, కన్నడ భాషల సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనే అంశంపై కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సభ శుక్రవారం జరిగింది. వైవీయూ తెలుగుశాఖ విభాగాధిపతి డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వీసీ సూర్యకళావతి హాజరై మాట్లాడుతూ భాష అనేది మనిషిని మరో మనిషిని కలుపుతుందన్నారు. తెలుగుభాష తియ్యనిది, కన్నడ భాష అందమైనదని తెలిపారు. ద్రవిడ భాష కుటుంబంలో తెలుగు, కన్నడ సోదర భాషలని, ఈ భాషలకు అపూర్వ స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో ఉత్తర అమెరికా తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి, చెన్నై మద్రాసు యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యాపకుడు సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:57:57+05:30 IST