ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిలో బోర్డు పెట్టారు

ABN, First Publish Date - 2021-11-25T04:44:42+05:30

తహసీల్దార్‌ మహేశ్వర్‌రెడ్డి ఇది ప్రభుత్వ భూమి అంటూ అక్కడ బోర్డు పాతారు.

ప్రభుత్వ భూమిలో పాతిన బోర్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కడప, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన్‌ పరిధిలో సీకేదిన్నె మండలం ఊటుకూరు గ్రామ రెవెన్యూ పొలం సర్వే నెంబరు 208లో ఉన్న ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు సెప్టెంబరు 30న ‘కబ్జాలో తోపులు’ అనే కథనంతో ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన తహసీల్దార్‌ మహేశ్వర్‌రెడ్డి ఇది ప్రభుత్వ భూమి అంటూ అక్కడ బోర్డు పాతారు. ఇక్కడ సుమారు 3 ఎకరాలకు పైచిలుకు ప్రభుత్వ తోపు పొరంబోకు భూములున్నాయి. అయితే ఈ శివారు ప్రాంతం అంతా ఇప్పుడు రియల్‌ఎస్టేట్‌ నడుస్తోంది. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి ఎకరా సుమారు రూ.2 కోట్ల దాకా ఉంటుంది. ఈ భూమిని ఓ ఇద్దరు నేతలు తప్పుడు పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండడం ఆంధ్రజ్యోతి దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని అక్షర రూపంలో వెలుగులోకి తేవడంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలం కబ్జాకు గురి కాకుండా ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. 

Updated Date - 2021-11-25T04:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising