ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN, First Publish Date - 2021-10-23T05:25:03+05:30

ప్రతి ఉద్యోగి సమన్వయంతో పని చేసి ఉత్తమ ఫలితాలు సాఽధించాలని జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి


కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 22 : ప్రతి ఉద్యోగి సమన్వయంతో పని చేసి ఉత్తమ ఫలితాలు సాఽధించాలని జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. కడప నగరం సీఎ్‌సఐ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్‌లకు యాప్‌లపై ఒక రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందన్నారు. ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించే ప్రతి వస్తువుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెయిల్స్‌కు సంబంధించి వివరాలను త్వరితగతిన జిల్లా కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రజినీకాంత్‌రెడ్డి స్టూడెంట్‌ యాప్‌పై వివరించారు. కార్యక్రమంలో జిల్లా మండల విద్యాశాఖాధికారి సంఘం అధ్యక్షుడు పాలెం నారాయణ, జిల్లా సమగ్ర శిక్ష ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ నరసింహరాజు, అసిస్టెంట్‌ కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌నాయక్‌, జగనన్న విద్యాకానుక అన్లైన్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-23T05:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising