ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మార్సీ కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు

ABN, First Publish Date - 2021-06-23T05:21:40+05:30

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే రెండో విడత పాఠ్యపుస్తకాలు మంగళవారం ఎమ్మార్సీ సెంటర్‌కు చేరాయి.

మండలానికి చేరిన పాఠ్యపుస్తకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 22: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే రెండో విడత పాఠ్యపుస్తకాలు  మంగళవారం ఎమ్మార్సీ సెంటర్‌కు చేరాయి. మొదటి విడతలో 43,200 పాఠ్యపుస్తకాలు సరఫరా  చేయగా రెండో విడతలో 23,100 పుస్తకాలను సరఫరా చేశారు. మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఎమ్మార్సీ సెంటర్‌కు చేర్చారు. పాఠ్యపుస్తకాలను బుధవారం నుంచి ఆయా పాఠశాలలకు పంపిణీ చేయాలని కమ్యూనిటీ మొబలైజేషన్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌నాయక్‌ ఆదేశించారు. మండలంలో 125 పాఠశాలలు ఉండగా 1.35 లక్షలు పాఠ్యపుస్తకాలు అవసరం కాగా  ఇప్పటి వరకు దాదాపు 66 వేలు పాఠ్యపుస్తకాలు సరఫరా కాగా మరో 50 శాతం పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉం దన్నారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు ఎమ్మార్సీ సెంటర్‌కు చేర్చగా విద్యార్థులకు ఇచ్చే ఉచిత నోటు పుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ నాయక్‌ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య వరకు పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సావిత్రమ్మ, సీఆర్‌పీలు భాస్కర్‌, నాగేంద్ర, వరప్రసాద్‌, గాయత్రి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising