చేనేత కార్మికులను ఆదుకోండి
ABN, First Publish Date - 2021-10-30T04:52:51+05:30
కరోనా వలన లక్షలాది మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని టీడీపీ మాజీ చేనేత విభాగం అధ్యక్షుడు కరుమూరు వెంకటరమణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 29: కరోనా వలన లక్షలాది మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని టీడీపీ మాజీ చేనేత విభాగం అధ్యక్షుడు కరుమూరు వెంకటరమణయ్య ప్రభుత్వాన్ని కోరారు. 2019-20లో అఖిలభారత చేనేత సర్వే చేసిన సూచనలను ప్రభుత్వాలు అమలు చేయడంలేదన్నారు. అధికారులకు చేనేత రంగంపై అవగాహన లేకపోవడంతో చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. చేనేత కార్మికులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యూనిఫాం మగ్గం పై నేసిన వస్త్రాలను ఉపయోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ పత్రికా ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-10-30T04:52:51+05:30 IST