ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షల నిర్వహణపై మొండివైఖరి తగదు

ABN, First Publish Date - 2021-04-24T04:21:42+05:30

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తుండడం తగదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పది, ఇంటర్‌ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 23 : రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తుండడం తగదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.  శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సీబీఎస్‌ఈ, సీఏఎస్‌ఈ పరీక్షలను రద్దుచేయగా, అదే బాటలో తెలంగాణ, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు దాదాపు 15లక్షల మంది ఉన్నారని, కరోనా నేపఽథ్యంలో పరీక్షలపై వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేసి రద్దు చేయాలన్నారు.  సమావేశంలో టీడీపీ నేత లు సుబ్బరాజు, విజయభాస్కర్‌రెడ్డి, ఏసుదాసు ఉన్నారు. 

Updated Date - 2021-04-24T04:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising