ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-04-17T05:03:01+05:30

ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటివారినైనా వదిలి పెట్టేది లేదని తిరుపతి టాస్క్‌ఫోర్సు డీఎస్పీ వి.వి గిరిధర్‌ హెచ్చరించారు.

రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న టాస్క్‌ఫోర్సు డీఎస్పీ గిరిధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి టాస్క్‌ఫోర్సు డీఎస్పీ వి.వి గిరిధర్‌

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 16: ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటివారినైనా వదిలి పెట్టేది లేదని తిరుపతి టాస్క్‌ఫోర్సు డీఎస్పీ వి.వి గిరిధర్‌ హెచ్చరించారు. శుక్రవారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్ర స్మగ్లింగ్‌ అరికట్టేందుకు అనేక విధాలుగా నిఘాలు ఉన్నాయన్నారు. పదే, పదే ఎర్రచందనం కేసుల్లో చిక్కితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని తెలిపారు. అటవీ శివారు ప్రజలు స్మగ్లింగ్‌పై సమాచారం అందించాలన్నారు. వృక్ష సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టుతున్నారన్నారు. ఎర్రచందనంపై ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్సు బలగాలు పూర్తి స్థాయిలో కూంబింగ్‌ చేస్తున్నాయన్నారు. అడవిలో ప్రతి అంగుళం పరిశీలిస్తుందన్నారు. తిరుపతి, రైల్వేకోడూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఉన్న టాస్క్‌ఫోర్సు బృందాలు అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించి ఎర్రచందనం కాపాడేందుకు ముమ్మరంగా ముందుకుపోతుందన్నారు. అడవిలో ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఎర్రచందనం సంపదను కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారుల సహకారం తీసుకుంటామని తెలిపారు. అటవీ సంపంద నాశనం అయితే మానవాళి మనుగడ ఉండదన్నారు. అందు వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో అధికారులకు, ప్రభుత్వానికి సహకరించి, సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యం ఉంచుతామని తెలిపారు.

Updated Date - 2021-04-17T05:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising