ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-02-07T04:22:32+05:30

గ్రామ పంచాయతీల్లో జరగబోయే ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌ హెచ్చరించారు.

మాట్లాడుతున్న కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌

చెన్నూరు, ఫిబ్రవరి 6: గ్రామ పంచాయతీల్లో జరగబోయే ఎన్నికల్లో  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం చెన్నూరు గ్రామ పంచాయతీ ఆవరణం లో అన్ని పార్టీల నాయకులు, పోటీచేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రచారం చేసే అభ్యర్థులు ఓటు అడగాలే తప్ప ఇతరుల గురించి అవమానకర రీతిలో మాట్లాడవద్దని, వారి గత చరిత్రల గురించి విమర్శలు వద్దన్నారు. ప్రార్ధనా మందిరాల్లో ప్రచారాలు నిషిద్దమని, ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్లను అంటించవద్దన్నారు. అభివృద్ధి చేసే పనులే చెప్పాలి తప్ప ప్రజల మనసు నొప్పి పెట్టే విధంగా మాట్లాడకూడదన్నారు. మద్యం, డబ్బులు పంపిణీ చేయకూడదన్నారు. గొడవలకు పాల్పడి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారికి కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరించారు. యు వత కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరని, కేసు నమోదు చేయడం వల్ల అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మారతారన్నారు. ఓటు అడగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అయితే కించపరిచే విధంగా ఎవరినీ మాట్లాడడం కానీ, విబేధాలు, గొడవలు వచ్చేలా వ్యవహరించడం కానీ చేయవద్దన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టాలని చూసే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కడప టూటౌన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ, ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising