ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనాలపై ప్రత్యేక నిఘా : డీఎస్పీ

ABN, First Publish Date - 2021-06-20T04:56:08+05:30

రాయచోటి పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపుతామని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు.

చోరీ అయిన ద్విచక్రవాహనాలతో డీఎస్పీ వాసుదేవన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, జూన్‌19: రాయచోటి పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపుతామని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చే సినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం ఎస్‌ఐ ఇనాయతుల్లా పోలీస్‌ సిబ్బందితో కలిసి వెలిగల్లు ప్రాజెక్టుకు సమీపంలో గుర్రాలమిట్ట వద్ద కదిరి- రాయచోటి ప్రధాన రహదారిపై వాహన తనిఖీ చేపట్టారన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా వెలిగల్లు వైపు నుంచి తూముకుంట గ్రామం ఎగువ మూలకు చెందిన మామిళ్ల వీరారెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పాటు గతంలో ఆ వాహనం చోరీ అయినట్లు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు అయినట్లుగా గుర్తించి, మోటార్‌ సైకిల్‌తో పాటు వీరారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. అతను ఈ వాహన మే కాకుండా రాయచోటి, అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రి పట్టణాల్లో మరో మోటారు సైకిళ్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడన్నారు. మిగిలిన మూడు వాహనాలు తన సొంత ఊరైన ఎగువమూలకు తూర్పు దిశలో కంపచెట్లలో దాచిపెట్టినట్లు చెప్పగా ఆ మూడు వాహనాలను గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించి నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకొని వీరారెడ్డిని అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌, ఏఎ్‌సఐ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T04:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising