ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2021-10-29T05:14:48+05:30

పోలీ స్‌ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నా రు.

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు సిబ్బందికి ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సూచన


కడప(క్రైం), అక్టోబరు 28: పోలీ స్‌ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నా రు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నగరంలోని ఉమేష్‌ చంద్ర స్మారక పోలీస్‌ కల్యాణ మండపంలో పోలీసు సిబ్బంది, వారి కుటుం బ సభ్యులకు ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌, రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో శ్రీశ్రీ హోలిస్టిక్‌, శ్రీకర్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఉమాకాంత్‌, భారత్‌కుమార్‌రెడ్డి, మమతేశ్వరి, సాయిసుజీత్‌కోరా, రామాంజులరెడ్డి, అఖిలరెడ్డి, మాధవి, మల్లిఖార్జునప్రసాద్‌, మోహన్‌రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడి అధిగమించడానికి యోగ, ధ్యానం చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్‌), ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌, అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌డీఎస్పీ రమ్య, పోలీస్‌ సంక్షేమ వైద్యశాల యూనిట్‌ వైద్యురాలు సమీరాభాను, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, జార్జ్‌, వీరేష్‌, సోమశేఖర్‌నాయక్‌, నగరంలోని సీఐలు సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, నాగభూషణం, ఎస్‌ఎం.అలీ, నరేంద్రరెడ్డి, ఆర్‌ఎ్‌సఐలు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising