సౌమ్యనాథస్వామి హుండీ లెక్కింపు
ABN, First Publish Date - 2021-10-22T04:54:07+05:30
జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన హుండీని లెక్కించారు.
హుండీ డబ్బులను లెక్కిస్తున్న దృశ్యం
నందలూరు, అక్టోబరు 21 : జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు వేసిన 5 నెలలకు సంబంధించి కానుకలను లెక్కించగా 11,42,363 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ డబ్బులను ఆలయానికి సంబంధించిన ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమిశెట్టి ప్రభాకర్, తుమ్మల శ్రీధర్, నాని, మోహన్‌రెడ్డి, కాకిచంద్ర, నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T04:54:07+05:30 IST