ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృతానగర్‌ సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-07-27T04:53:50+05:30

మండల పరిధిలోని అమృతానగర్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.

సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం ఇస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు రూరల్‌, జూలై26: మండల పరిధిలోని అమృతానగర్‌లో నెలకొన్న  సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. ఆ మేరకు  సోమవారం అమృతానగర్‌ సచివాలయ కార్యదర్శి సుమలతకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. వర్షం కురిస్తే అమృతానగర్‌లోని చాలా వీధుల్లో వర్షంనీరు, మురుగునీరు పెద్ద పెద్ద కుంటలుగా తయారై దోమలకు, వ్యాధులకు నిలయాలుగా నిలిచాయన్నారు. వర్షంనీరు, మురుగునీరు వెళ్లేందుకు కాలువల నిర్వహణ చేపట్టాలని అలాగే రాత్రి సమయాల్లో విషపురుగులు ఇళ్లలోకి రాకుండా ఖాళీ ప్రదేశాల్లోని కంపచెట్లు తొలగించేలా  చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై సచివాలయ కార్యదర్శి సుమలత స్పందిస్తూ  కాలువలు తవ్వించి వర్షంనీరు వెళ్లేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అమృతానగర్‌లోని అన్ని వీధుల్లో బ్లీచింగ్‌పౌడర్‌ చల్లడంతోపాటు దోమల నివారణ మందును పిచికారి చేయిస్తామన్నారు. వినతి పత్రం ఇచ్చినవారిలో ఆటో యూనియన్‌ నాయకులు ఆర్‌.శ్రీనివాసులు, కాలనీవాసులు సావిత్రి, లక్ష్మిదేవి, సెహనాజ్‌, సరస్వతి, యల్లయ్య, నాగలక్షుమ్మ, లక్ష్మికాంతరెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-07-27T04:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising