ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడే ఆరుగురి అరెస్టు

ABN, First Publish Date - 2021-01-21T05:53:13+05:30

గుప్తనిఽధులకోసం తవ్వకాలు జరిపే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక కారు, నాలుగు తెల్లరాళ్లు, డ్రోసింగ్‌ రాడ్స్‌, గడ్డపార, పార స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డితో కలిసి అదనపు ఎస్పీ (పరిపాలన) కాసీంఖాన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారు, నాలుగు తెల్లరాళ్లు, డ్రోసింగ్‌ రాడ్స్‌, గడ్డపార స్వాధీనం

కడప(క్రైం), జనవరి 20: గుప్తనిఽధులకోసం తవ్వకాలు జరిపే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక కారు, నాలుగు తెల్లరాళ్లు, డ్రోసింగ్‌ రాడ్స్‌, గడ్డపార,  పార స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డితో కలిసి అదనపు ఎస్పీ (పరిపాలన) కాసీంఖాన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

    చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని రాజన్న పార్కు ప్రాంతంలో నివాసం ఉండే జాగీర్దార్‌ పూర్ణప్రజ్ఞ(34), మున్సిపాలిటీ కార్యాలయం వెనుకవైపు నివాసం ఉండే కమ్మినేని జ్ఞానేంద్రనాయుడు, వీకేఆర్‌ కాలనీకి చెందిన కర్ణ హరినాధ్‌(61), చంద్రగిరికి చెందిన శేషాద్రి(39), చంద్రగిరి జగదీష్‌(24), నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె వాసి గుడిసె సునీల్‌(38) దేవాలయాల సమీపంలో గుప్తనిధుల కోసం తిరుగుతూ ఉండేవారు. ఎవరూ లేని సమయంలో దేవాలయం ఎదుట గుప్తనిధులకోసం తవ్వేవారు. ఈ నేపథ్యంలో వీరు ఆరుగురూ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నందలూరు మండలం కుంపిణీపురంలోని ఓ గుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టి కారులో తిరిగి వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల దేవాలయాల హుండీ దొంగతనాలు, దాడులను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. నిందితులనుంచి గడ్డపార, పార, ఆరు డ్రోసింగ్‌ రాడ్స్‌, నాలుగు తెల్లరాళ్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండుకు తరలించామని ఏఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-01-21T05:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising