ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2021-12-01T04:42:25+05:30

జమ్మలమడుగు నుంచి ముద్దనూరు వెళ్లే రహదారిలోని పెన్నానదిపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోవటంతో 16 గ్రామాల ప్రజలకు మైలవరం కట్ట వెంబడి రాకపోకలు సా గించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

మైలవరం జలాశయంపైన రహదారి వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికారులకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచన

మైలవరం, నవంబరు 30: జమ్మలమడుగు నుంచి ముద్దనూరు వెళ్లే రహదారిలోని పెన్నానదిపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోవటంతో  16 గ్రామాల ప్రజలకు మైలవరం కట్ట వెంబడి రాకపోకలు సా గించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  చూడాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలాశయ, ఎంపీడీవో తదితర అధికారులతో కలిసి ఎమ్మె ల్యే మైలవరం జలాశయంపై  రహదారిని పరిశీలించారు. మైలవరం జలాశయ కట్టపై కూడా వాహనాలు తిరగకుండా జలాశయ అధికారులు ఆదేశించడంతో ఎమ్మెల్యే అక్కడకు వెళ్లి రహదారిని పరిశీలించి కలెక్టర్‌, ఆర్డీవోలతో చర్చించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. జలాశయ రహదారిపై ఒక్కొక్కరు ప్రయాణం చేస్తూ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామకృష్ణ, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి, నాయకులు మహేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

16 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించండి

 మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత నారాయణరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 30: జమ్మలమడుగు-ముద్దనూరు మార్గంలో వంతెన కుంగిపోవడంతో రవాణా నిలిచిపోయిన 16 గ్రామాలకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత దేవగుడి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు మంగళవారం జమ్మలమడుగు సమీపాన పెన్నానదిలో దెబ్బతిన్న వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన కుంగిపోవడంతో మైలవరం కట్టపై నుంచి కొన్ని గ్రామాలవారు చుట్టూ తిరిగి జమ్మలమడుగు రావాల్సి వస్తోందన్నారు. అయితే అక్కడ కూడా కట్టపై నుంచి ప్రజలు తిరగవద్దని చెప్పడంతో వారు రవాణా సౌక ర్యం ఎలా చేయాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి 16 గ్రామాల ప్రజలకు వంతెన దెబ్బతిన్న పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో  మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మూలింటి గురప్ప తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-01T04:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising