ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతిపాలన విధించాలి

ABN, First Publish Date - 2021-10-20T05:18:26+05:30

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే ప్రభుత్వాన్ని బర్తరఫ చేసి రాష్ట్రపతిపాలన విధించాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు, రాష ్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

కడపలో టీడీపీ నేతల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు

నేడు టీడీపీ రాష్ట్ర బంద్‌

అమీర్‌బాబు, రెడ్యం


కడప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే ప్రభుత్వాన్ని బర్తరఫ చేసి రాష్ట్రపతిపాలన విధించాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు, రాష ్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతలు అమీర్‌బాబు ఇంటిని ముట్టడించి దౌర్జన్యంగా ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయం నుంచి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అమీర్‌బాబు ఇంటిని ముట్టడించి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వన్‌టౌన్‌ ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని వైసీపీ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని తక్షణమే రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపి శాంతి భద్రతలను కాపాడాలన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి, టీడీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని వారు కోరారు.

Updated Date - 2021-10-20T05:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising