పాఠ్యపుస్తక రచనకు మొగల్ ఖాజా హుస్సేన్ ఎంపిక
ABN, First Publish Date - 2021-10-30T05:01:10+05:30
ఎనిమిదో తరగతి హిందీ పాఠ్యపుస్తక రచన, రూపకల్పనకు నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు మొగల్ ఖాజా హుస్సేన్ ఎంపిక అయ్యారు.
నందలూరు, అక్టోబరు 29 : ఎనిమిదో తరగతి హిందీ పాఠ్యపుస్తక రచన, రూపకల్పనకు నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు మొగల్ ఖాజా హుస్సేన్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ అధికారుల నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను ప్రచురించనుంది. అందులో భాగంగా హిందీ పాఠ్య పుస్తక రూపకల్పన చేయనున్నారు. గతంలో ఖాజా హుస్సేన్ ఆనందవేదిక పాఠ్యపుస్తకాల రూపకల్పనలో హిందీ కరదీపికలో, 7వ తరగతి హిందీ పాఠ్యపుస్తక రచనలో పాల్గొన్నారు. ఈ ఉత్తర్వుల పట్ల నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకారం, ఉపాధ్యాయులు గంగాధర్, ఖాదర్ బాషా, చంద్రశేఖర్, శేఖర్ బాబు, చాంద్‌బాషా, ఆనందాచారి, జోసఫ్, గౌరీ హర్షం వ్యక్తం చేస్తూ ఖాజా హుస్సేన్‌ను అభినందించారు.
Updated Date - 2021-10-30T05:01:10+05:30 IST