ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సర్పంచ్‌ల మొదటి బ్యాచ్‌ శిక్షణ

ABN, First Publish Date - 2021-07-25T04:40:29+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన మొదటి బ్యాచ్‌ సర్పంచ్‌ల శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి.

జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డితో శిక్షణను పూర్తిచేసుకున్న సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప రూరల్‌, జూలై 24 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన  మొదటి బ్యాచ్‌ సర్పంచ్‌ల శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. జిల్లాలోని కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేటలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలలో దాదాపు 157 మంది సర్పంచ్‌లు శిక్షణ పొందారు. ఇందులో చింతకొమ్మదిన్నె, చెన్నూరు, ఖాజీపేట మండలాలకు చెందిన 36 మంది, బద్వేలు, కలసపాడు మండలాలకు సంబంధించి 20 మంది, రాజంపేట మండలానికి చెందిన 21 మంది, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మండలాలకు చెందిన 40 మంది, వేంపల్లి మండలాలకు చెందిన 40 మంది సర్పంచ్‌లు శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శనివారం కడప డీపీఆర్‌సీ భవనంలో శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు శిక్షణా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ శిక్షణను పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి బాటలు వేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు చేయూతను అందించాలని తెలిపారు.

Updated Date - 2021-07-25T04:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising