ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ పారిశుధ్యం అధ్వానం

ABN, First Publish Date - 2021-02-27T05:09:03+05:30

యర్ర గుడిపల్లెలో అధ్వాన్న పారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మురుగు కాల్వల్లో చెత్తాచెదారాలు నిండి మురుగును ముందుకు కదలనీకుండా చేస్తున్నాయి. కాల్వ ల్లోని చెత్తాచెదారాలు కుళ్లి మరింత దుర్ఘం ధం వెదజల్లుతోంది.

యర్రగుడిపల్లెలో చెత్తాచెదారాలతో నిండిన మురుగుకాల్వలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెత్తాచెదారాలతో నిండిన మురుగుకాల్వలు

పులివెందుల రూరల్‌, ఫిబ్రవరి 26: యర్ర గుడిపల్లెలో అధ్వాన్న పారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మురుగు కాల్వల్లో చెత్తాచెదారాలు నిండి మురుగును ముందుకు కదలనీకుండా చేస్తున్నాయి. కాల్వ ల్లోని చెత్తాచెదారాలు కుళ్లి మరింత దుర్ఘం ధం వెదజల్లుతోంది. ఫలితంగా స్థానిక ప్రజ లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

కదలని మురుగు నిల్వ ఉండడంతో దోమల ఉ దృతి పెరుగుతోందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కుళ్లిన వ్యర్థాల దుర్ఘంధం మరోవైపు దోమల ఉదృతితో ప్రజ లు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

దోమల ఉదృతి పెరిగితే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిప ల్‌ అధికారులు, సిబ్బంది మురుగుకాల్వల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించే పరిస్థితులు కూడా లేవని ప్రజలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధుల బారినపడే ప్రమాదం ఉన్నందున అధికారులు, తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-02-27T05:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising