ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.750 కోట్లు సంక్షేమ నిధికి జమ చేయాలి

ABN, First Publish Date - 2021-07-28T04:58:47+05:30

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నిధి నుంచి వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించిన రూ.750 కోట్ల మొత్తాన్ని తిరిగి ఆ సంక్షేమ నిధిలో జమ చేయా లని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, జూలై 27: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం  నిధి నుంచి వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించిన రూ.750 కోట్ల  మొత్తాన్ని తిరిగి ఆ సంక్షేమ నిధిలో జమ చేయా లని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యా లయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదా నికి గురైతే నెలకు రూ.3 వేలు వంతెన మూడు నెలలపాటు అందించేదన్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను పూర్తిగా దగా చేస్తోందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వైసీపీ ప్రభుత్వ తీరుతో ఉపాధి కోల్పోయి ఎంతో మంది ఆత్మహ త్యలకు పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో రూ.1200 కోట్లు ఉంటే ఆ మొత్తం కేవలం భవన నిర్మాణ కార్మికుల కోసమే వినియోగించాల్సి ఉండగా జగన్‌ సర్కా ర్‌ అందులో నుంచి రూ.750 కోట్లు నవరత్నాలకు, ఇతర వాటికి వినియోగించడం దుర్మార్గమన్నారు. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.5 వేలు వంతున కరోనా భృతి చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-28T04:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising