ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకో స్కీంతో దోచుకుంటున్నారు : కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2021-12-09T04:52:10+05:30

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రోజుకో పథకం పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తే వాటిని రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.10, 15, 20 వేలు వసూళ్లకు దిగడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.

మాట్లాడుతున్న నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 8: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రోజుకో పథకం పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తే వాటిని రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.10, 15, 20 వేలు వసూళ్లకు దిగడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఏదైనా ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పథకాలకు పేర్లు పెడుతుంటారని, కానీ మన రాష్ట్రంలో జగనన్న శాశ్విత గృహ హక్కు పథకం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేమిటన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్రవకుమార్‌రెడ్డి, అసంఘటిత కార్మిక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య, నగర మహిళా అధ్యక్షురాలు లావణ్య, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, ఆనంద్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising