ఘనంగా మే డే
ABN, First Publish Date - 2021-05-02T04:45:46+05:30
జిల్లాలో కార్మికుల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. పలుచోట్ల మే డే జెండాను ఆవిష్కరించారు.
నల్లచట్టాలు వెనక్కి తీసుకోవాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య
కడప (రవీంద్రనగర్), మే 1: జిల్లాలో కార్మికుల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. పలుచోట్ల మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా కేంద్ర ప్రభుత్వం చేస్తు న్న కార్మిక వ్యతిరేక చట్టాలపై పలువురు మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన దుర్మార్గ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు వెనక్కి తీసుకో వాలని, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, రైల్వే గూడ్సు షెడ్డు హమాలీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కడపలోని రైల్వేస్టేషన్‌లో యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా సాకుతో మోదీ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేయాలని, పోరాడి సాధించుకున్న కార్మికుల 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చాలని చూస్తున్నారని, అది సాధ్యపడదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను రైల్వే, విమానయానం, కోర్టు, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయాలను కోవడం ఎంత మాత్రం తగదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైల్వే గూడ్సు షెడ్డు హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కేసీ బాదుల్లా, ఎస్.మహబూబ్‌బాషా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్న, మహబూబ్, బాలయ్య, గంగరాజు, చిన్న ఓబులేసు, సూరి, సుబ్బరామయ్య, హుసేన్ పాల్గొన్నారు.
Updated Date - 2021-05-02T04:45:46+05:30 IST