ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమశిల ముంపు బాధితుల ఉద్యోగకల్పనపై నివేదికలు ఇవ్వాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-22T04:58:49+05:30

సోమశిల ముంపుబాధితుల ఉద్యోగాల కల్పన కోసం ఎంపిక చేసిన జాబితాపై అభ్యంతరాలను పునఃపరిశీలించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సి.హరికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌) జనవరి 21.. సోమశిల ముంపుబాధితుల ఉద్యోగాల కల్పన కోసం ఎంపిక చేసిన జాబితాపై అభ్యంతరాలను పునఃపరిశీలించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో జేసీ(రెవెన్యూ) గౌతమితో కలసి సోమశిల ముంపు బాధితులకు ఉద్యోగ కల్పనపై జిల్లా సెలక్షన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సోమశిల ముంపు బాధితులకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయమై 2015 సంవత్సరంలో డీఎస్సీ ద్వారా వారి  అర్హతల మేరకు 9751 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రాథమిక జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ఉద్యోగాల ఎంపిక విషయమై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, అర్హుల జాబితాలో కొన్ని అవకతవకలు జరిగాయనే పిర్యాధులున్నాయని, జాబితాను పునః పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని సంబంధిత అదికారులను, డీఎస్సీ కమిటీ సభ్యులను ఆధేశించారు. కార్యక్రమంలో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌, స్పెసల్‌ డిప్యూటీ కలెక్టర్లు సతీష్‌చంద్ర, అజయ్‌ కుమార్‌, సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈ కృష్ణారావు, ఆత్మకూరు సోమశిల ఈఈ ఎంవీ రమనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T04:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising