ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల పహారా మధ్య రెన్యువల్స్‌

ABN, First Publish Date - 2021-05-07T04:52:44+05:30

ఒకవైపు రైతులు, మరో వైపున డ్వాక్రా సభ్యుల సమస్యలు, సిబ్బంది కొరత ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ను పట్టిపీ డిస్తున్నారు.

ఏపీజీ బ్యాంకు వద్ద గుంపులుగా ఉన్న ఖాతాదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, మే 6: ఒకవైపు రైతులు, మరో వైపున డ్వాక్రా సభ్యుల సమస్యలు, సిబ్బంది కొరత ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ను పట్టిపీ డిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన ప్రారంభంతో రైతులు రుణాలను రెన్యువ ల్స్‌ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు వాడాలని చెబితే రైతులు గొడవకు దిగుతున్నారు.

దీంతో పోలీసుల పహారా మధ్య బ్యాంకు అధికారులు రెన్యువల్స్‌ చేస్తున్నా రు. బ్యాంకులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇటీవల మేనేజర్‌ ఉద్యోగ విరమణ చెందడంతో ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. ఐదుగురు ఉద్యోగులకు ఇద్దరే పనిచేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగు లతో తొమ్మిదివేల మంది రైతుల రెన్యువల్స్‌, బ్యాంకు లావాదేవీలు, డ్వాక్రా సంఘాలకు ఏమేరకు న్యాయం చేస్తారనేది ప్రశ్నగానే మిగు లుతోంది.

శుక్రవారం నుంచి బ్యాంకు సమయాలను ఉదయం 9గం టల నుంచి 1గంట వరకు మారుస్తున్నారు. సకాలంలో రెన్యువల్‌ చేయకుంటే పావలా వడ్డీ వారికి వర్తించదు. దీంతో రైతులు తప్పద న్నట్లు తోపులాటలకు పూనుకొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి బ్యాంకులో సిబ్బంది కొరత తీర్చాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T04:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising