ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం..

ABN, First Publish Date - 2021-06-24T04:39:39+05:30

అటవీ పరీవాహక గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పెద్దల సహకారంతో రాజంపేట డివిజన్‌ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని రాజంపేట డీఎ్‌ఫవో జి.శ్రీనివాసులు వెల్లడించారు.

జి.శ్రీనివాసులు, డీఎ్‌ఫవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాజంపేట డీఎ్‌ఫవో జి.శ్రీనివాసులు 

రాజంపేట, జూన్‌23 : అటవీ పరీవాహక గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పెద్దల సహకారంతో రాజంపేట డివిజన్‌ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని రాజంపేట డీఎ్‌ఫవో జి.శ్రీనివాసులు వెల్లడించారు. చిత్తూరు నుంచి రాజంపేటకు ఇటీవలే బదిలీపై వచ్చిన శ్రీనివాసులు మాట్లాడుతూ తాను, తమ సిబ్బంది రాజంపేట అటవీ శాఖ డివిజన్‌ చుట్టుపక్కల నెల్లూరు, గూడూరు, తిరుపతి, రాయచోటి, కడప డీఎ్‌ఫవోలతోనూ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులతోనూ, స్థానిక పోలీసులతోనూ సమన్వయం చేసుకొని సమష్టి కృషితో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి దృష్టి నిలిపినట్లు తెలిపారు. ప్రధానంగా తమిళనాడు నుంచి వచ్చే ఎర్రచందనం కూలీలను, స్మగ్లర్లను సులభంగా కనుక్కోవచ్చునన్నారు. రైలులో వస్తే టీసీల ద్వారా, బస్సుల్లో వస్తే కండక్టర్లు, డ్రైవర్ల ద్వారా, ఆర్టీవో చెక్‌పోస్టులలో అనుమానాలు వస్తే వారిని గుర్తించి తమకు సమా చారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.   ప్రధానంగా అటవీ పరీవాహక ప్రాంతాల్లోని రైతులు ఎర్రచందనం స్మగ్లర్లను సులభంగా గుర్తించవచ్చునన్నారు. స్మగ్లర్లు తాము స్మగ్లింగ్‌ చేసిన ఎర్రచందనాన్ని డంపింగ్‌ చేసి రైతుల పొలాల్లో దాచిపెట్టిన సంఘటనలు ఉన్నాయని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా స్మగ్లర్లకు సహకరిస్తే వారిని కూడా ప్రధాన నిందితులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అటవీ గ్రామాల్లో తమ ఫోన్‌నంబర్లను ఉంచడం జరిగిందని, తమకు సమాచారం ఇస్తే రివార్డులు కూడా ఇస్తామన్నారు.  వన్యప్రాణాలను రక్షించుకోవాలని, వాటికి హాని కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-06-24T04:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising