ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణం

ABN, First Publish Date - 2021-06-13T05:08:05+05:30

వైసీ పీ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రజలపై పన్నుల భారం మోపుతూ వారి నడ్డివిరుస్తుండడం దారుణమని కాం గ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పీఎండీ నజీర్‌ విమర్శించారు.

మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ నజీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 12: వైసీ పీ ప్రభుత్వం రెండేళ్లుగా  ప్రజలపై పన్నుల భారం మోపుతూ వారి  నడ్డివిరుస్తుండడం దారుణమని  కాం గ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పీఎండీ నజీర్‌ విమర్శించారు. శనివారం స్థాని క  కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆ యన విలేకర్లతో మాట్లాడుతూ  రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అన్నివిధాల తీవ్రంగా నష్టపోయారన్నారు. నిత్యావసర ధరల నుంచి విద్యుత్‌, ఇసుక, పెట్రోల్‌ డీజల్‌, సిమెంటు వరకు అన్ని ధరలు భారీగా పెరిగాయని దీనికి తోడు ఇంటి పన్నులు, చెత్త పన్నులు కూడా మోపి బాధ్యత లేకుండా వ్యవహరించడం ప్రభు త్వానికి తగదన్నారు.  ఒకవైపు కరోనా మృత్యు పంజా విసిరి పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పన్నుల వసూళ్లకు ఏ ముఖం పెట్టుకొని ప్రభు త్వం ముందుకొస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఏకతాటిపైకి వచ్చి పోరాటాలకు సిద్ధ్దం కావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు ఎల్లయ్య సుభాన్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-13T05:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising