ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షంతో స్తంభించిన జనజీవనం

ABN, First Publish Date - 2021-10-30T04:50:32+05:30

అల్పపీడన ప్రభావం వల్ల ప్రొద్దుటూరు పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాం తాల్లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.

ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డుపై నిలిచిన వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, అక్టోబరు 29 : అల్పపీడన ప్రభావం వల్ల ప్రొద్దుటూరు పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాం తాల్లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.  తేలిక పా టి జల్లులుతో మొదలైన వర్షం సాయంత్రం కల్లా భారీగా కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టుప్రాంతాలు, పలు వీధులు జలమయ మయ్యాయి. రోజువారీ రోడ్లపై, బండ్లమీద వీధివ్యాపారం చేసుకొనేవారికి  వ్యాపారాలు లేక ఇంటికే పరిమిత మయ్యారు. ఇక భవననిర్మాణ కార్మి కులకు పనులు నిచిపోయి ఇంటికి వెళ్లాల్సివచ్చింది. దీనికి తోడు  దుకాణాల్లో సైతం వ్యాపారాలు వెలవెలబోయాయి. రోజంతా ఏ పనులు సాగకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇక్కట్లు పడ్డారు. .వర్షానికి కాలువల్లో నీటి ప్రవాహం నిలిచిపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహించింది. పట్టణంలోని గాంధీరోడ్డు, కొర్రపాడు రోడ్డులో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద, ఆర్‌అండ్‌బీ రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పట్టణం లోని పలు లోతట్టుప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై ప్రవహించాయి. వాతావ రణ అధికారులు ప్రకటించినట్లు మరో రెండురోజులు ఇలాగే వర్షాలు పడితే కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వర్షంతో పనుల్లేక ఇబ్బందులు పడు తున్న కూలీలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎర్రగుంట్లలో..

ఎర్రగుంట్ల, అక్టోబరు 29: నగర పంచాయతీతోపాటు మండల వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  రైతులు శనగ విత్తనం వేసి వర్షం కోసం ఎదురుస్తున్న తరుణంలో వర్షం పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందస్తుగా వేసిన పంటలకు కొద్ది మేరకు నష్టం వాటిల్ల వచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ వర్షం రైతులకు అధికంగానే మేలుచేస్తుందని రైతులు పేర్కొంటున్నారు. అక్టోబరు మాసంలో 113 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉండగా   అయితే 27వ తేదీ వరకు  71 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎర్రగుంట్లలో శుక్రవారం కురిసిన వర్షానికి కొన్ని వీధులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 29: పట్టణంలో శుక్రవారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు జల్లులు కురియడంతో.  వ్యాపారులు, పట్టణ ప్రజానీకం ఇక్కట్లకు గురయ్యారు. వర్షం కారణంగా పలు చోట్ల వర్షపునీరు నిలిచాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లపై వర్షపునీరు నిలిచి కాలువులు, కుంటలను తలపించింది. దీంతో వాహనదారులు రోడ్లపై ఉన్న గుంతలతో ఇక్కట్లు పడ్డారు. ఈ వర్షంతో ముందుగా సాగు చేసిన పంటలు దెబ్బతింటాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల సాగు చేసిన పంటలకు ఈ వర్షపు ఎంతగానో ఉపయోగపడుతుందని మరి కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొండాపురంలో..

కొండాపురం, అక్టోబరు 29: మండలంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పలుచోట్ల రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-10-30T04:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising