ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-12-05T04:58:52+05:30

రోగులకు నాణ్యమైన, త్వరితగతిన సేవలు అందించాలని రాయచోటి ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులకు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

ఏరియా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి, డిసెంబరు4: రోగులకు నాణ్యమైన, త్వరితగతిన సేవలు అందించాలని  రాయచోటి ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులకు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శనివారం రాయచోటి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సంఘ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, కమిటీ సభ్యులు బేపారిమహమ్మద్‌ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, ఎంపీడీవో సురే్‌షలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై  శ్రీకాంత్‌రెడ్డి ఆరాతీశారు. భోజన వసతులు, పారిశుధ్య నిర్వహణ, మందుల నిల్వలపైన, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఖాళీలు, తాగునీటి సమస్యలపైన ఆరాతీశారు. ఆసుపత్రిలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.  కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై సిద్ధంగా ఉండాలని ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు మహేశ్వర్‌రాజు, వైద్యాధికారులు రెడ్డిభాస్కర్‌రెడ్డి, ఖదీర్‌కు సూచించారు. అనంతరం వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు.  

మొబైల్‌ ఎక్స్‌రే యంత్రం వితరణ.... రాయచోటి ఏరియా ఆసుపత్రికి రూ.3 లక్షల విలువచేసే మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాన్ని శనివారం ప్రభాకర్‌ సీడ్స్‌ యజమాని వితరణగా అందజేశారు. చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిఽథిగా పాల్గొని  ప్రారంభించారు.  

Updated Date - 2021-12-05T04:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising