ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛమైన నీటిని అందించాలి

ABN, First Publish Date - 2021-10-09T05:01:36+05:30

రాయచోటి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందివ్వడమే కాకుండా నీటి శుద్ధి కేంద్రంలో క్లోరినేషన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ సూచించారు.

ఎగువగొట్టివీడు వద్ద నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నీటిశుద్ధి కేంద్రంలో క్లోరినేషన్‌ తప్పనిసరి ఫ మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌

రాయచోటి, అక్టోబరు8: రాయచోటి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందివ్వడమే కాకుండా నీటి శుద్ధి కేంద్రంలో క్లోరినేషన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ సూచించారు. శుక్రవారం ఆయన వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి మున్సిపాలిటీకి సరఫరా అవుతున్న వెలిగల్లు రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గొట్టివీడు సమీపంలో ఉన్న నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించి నీటి శుద్ధికి ఉపయోగించే ఆలం, క్లోరిన్‌ తగిన మోతాదులో వినియోగిస్తూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నీటి సరఫరాలో అంతరాయాలు కలుగకుండా ట్రాన్స్‌కో అధికారుల సమన్వయంతో వెలిగల్లు, గొట్టివీడు ప్రాంతాల్లోని నీటిశుద్ధి కేంద్రాల వద్ద విద్యుత్‌ కోతలు లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే పట్టణంలో ఎక్కడైనా పైపులైన్లు లీకేజీలు ఉంటే యుద్ధ ప్రాతిపధికన పునరుద్ధరించాలని ఇంజనీరింగ్‌, వాటర్‌ వర్స్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలో రాయుడుకాలనీ, ఎన్జీవో కాలనీ, డైట్‌, ఎస్‌ఎన్‌కాలనీ, గర్ల్స్‌హైస్కూల్‌, మాసాపేట ప్రాంతాల్లో ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంకులను పరిశీలించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో నీటి ట్యాంకులను బ్లీచింగ్‌తో శుభ్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ సుధాకర్‌నాయక్‌, ఏఈ కృష్ణారెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-09T05:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising