ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌లో దాడుల పట్ల నిరసన

ABN, First Publish Date - 2021-05-06T04:48:26+05:30

పశ్చిమబెంగాల్‌ లో బీజేపీ కార్యకర్తలను చంపడం, మహిళ లపై లైంగిక దాడులు చేయడం దారుణమ ని కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశి భూషణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందులలో శశిభూషణ్‌రెడ్డి -
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన, మే 5:  పశ్చిమబెంగాల్‌ లో బీజేపీ కార్యకర్తలను చంపడం, మహిళ లపై లైంగిక దాడులు చేయడం దారుణమ ని కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశి భూషణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధ వారం స్వగృహంలో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతూ  పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణ మూల్‌ కాంగ్రెస్‌ గూండాలు రెచ్చిపోడం దారుణమన్నారు. తృణమూల్‌ అధినేత మ మతాబెనర్జీ, పోలీసులు ఈ దాడులను ఆప డంలో చొరవ తీసుకోకపో వడం చూస్తే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. 

మైదుకూరు, మే 5: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, అకృ త్యాలను వ్యతిరేకిస్తూ మైదుకూరులో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వినాయకస్వామి ఆలయం ఆవరణలో ప్లకా  ర్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు.  బీజేపీ నేతలు బీపీ ప్రతాప్‌రెడ్డి, శ్రీజ శ్రీధర్‌, రామక్రిష్ణ, రాజమోహన్‌రెడ్డి, సుబ్బరాయు డు,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

పోరుమామిళ్ల, మే 5: పశ్చిమ బెంగా ల్‌లో బీజేపీ కార్యకర్తల ఇళ్లపై దాడి, మార ణ కాండను నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రె స్‌ గుండాలను అరెస్టు చేయాలని డిమాం డ్‌ చేశారు. పోరుమామిళ్లలో బీజేపీ జిల్లా కార్యదర్శి రమణాచారి ఆయన స్వగృ హంలో నిరసన దీక్ష చేపట్టారు.

సింహాద్రిపురం, మే 5: బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త లపై దాడులు ఆపాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షు డు శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గూండాలపై చర్యలు చేప ట్టి,  ప్రజాస్వామ్యాన్ని కా పాడాలన్నారు. 

ఖాజీపేట, మే5: పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బీజేపీ కార్యదర్శి ఎన్‌.లక్ష్మిదేవి కోరారు. బెంగాల్‌ దాడులను నిరసిస్తూ ఖాజీపేటలోని ఆమె స్వగృహంలో ఆమె ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించి బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.





Updated Date - 2021-05-06T04:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising