ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పన్ను పెంపునకు ఓకే...

ABN, First Publish Date - 2021-07-27T04:49:56+05:30

మున్సిపల్‌ పరిధిలో ఆస్తిపన్ను మూలధన విలువ ఆధారంగా పెంపునకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవ ఆమోదం  పట్టణ ప్రజలకు తప్పని పన్నుల భారం

ప్రొద్దుటూరు, జూలై 26: మున్సిపల్‌ పరిధిలో ఆస్తిపన్ను మూలధన విలువ ఆధారంగా పెంపునకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పట్టణ ప్రజలపై పన్నుల భారం భారీగా పడనుంది. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భీమునిపల్లె లక్ష్మిదేవి అధ్యక్షతన సోమవారం మున్సిపల్‌ సభాభవనంలో  కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 17  అజెండాలోని అంశాలపై కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధానంగా ఆస్తి పన్ను పెంపుపై ఆమోదం తెలుపడం ప్రా ధాన్యత సంతరించుకుంది.  ఈ క్రమంలో ప్రొద్దుటూరు స్పెషల్‌గ్రేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో పన్నుల పెంపునకు కౌన్సిల్‌ ఆమోదం తెలుపడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దీనిని అమలు చేయనున్నారు. డ్రైనేజీ పన్నులు కలిపి 30 శాతం, ఖాళీ స్థలాలపె ౖ20 శాతం పన్నులు పెరగనున్నాయి. ప్రొద్దుటూరులో కొత్త పన్నుల విధానం వలన ప్రజలపె భారీగా పన్నుల భారం పడనుంది. ఇదే సందర్భంలో మున్సిపల్‌ ఖజానాకు ఆదాయం పెద్ద ఎత్తున పెరగనుంది. కరోనా కష్టకాలంలో పన్నుల పెంపుసరికాదంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌ శివజ్యోతి పేర్కొన్నారు. పెంపుతో ప్రజలు పడే ఇబ్బందులను ఆమె కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా తమ వార్డులో అధికార పార్టీకి సంబందించిన వ్యక్తి ని ఇన్‌ఛార్జిగా పెట్టడం వలన తన ప్రాధాన్యతను తగ్గించినట్లు అవుతుందని ఆమె కౌన్సిల్‌కు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ తరుపున ఒకే ఒక్క కౌన్సిలర్‌ గెలిచినప్పటికి వైసీపీ కౌన్సిలర్‌తోపాటు సమానమైన స్థానం కల్పిస్తామన్నారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో వీధిలైట్లు సక్రమంగా వెలుగడంలేదని, మరమ్మతులు చేయడంలేదని సమావేశం దృష్టికి తెచ్చారు.  సమావేశంలో ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌, వైస్‌ఛైర్మన్‌ ఖాజామొద్దీన్‌, కమిషనర్‌ రాధ, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising