కషాయంతో వైరస్ నివారణ
ABN, First Publish Date - 2021-10-22T04:55:45+05:30
కషా యంతో పంటలకు సోకే వైరస్‌ను నివా రించవచ్చని పులివెం దుల డివిజన్ ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మస్తాన్ పేర్కొ న్నారు.
పులివెందుల రూరల్, అక్టోబరు 21: కషా యంతో పంటలకు సోకే వైరస్‌ను నివా రించవచ్చని పులివెం దుల డివిజన్ ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మస్తాన్ పేర్కొ న్నారు. నల్లపురెడ్డిపల్లె లో టమోటా పంటకు సోకిన వైరస్‌ను పరిశీ లించారు. అకాల వ ర్షాల కారణంగా ట మోటా పంటకు వైర స్ సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్దతి లో పచ్చిపేడ, పసుపు ద్రావణం, కలబంద, ఉమ్మెత్త ఆకు కషాయం వాడి ఈ వైరస్‌ను నివారించవచ్చన్నారు. పచ్చి పేడ, పసుపు ద్రావ ణం ఆంటీబయోటిక్‌గా, కలబంద, ఉమ్మెత్త ఆకు కషాయం వైరస్ నివారణకు పనిచేస్తుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగు ఎంతో లాభదాయకమని, ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని తెలిపారు.
Updated Date - 2021-10-22T04:55:45+05:30 IST