ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల వద్దకే తపాలా సేవలు

ABN, First Publish Date - 2021-03-09T04:57:03+05:30

తపాలా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అధునాతన పద్ధతులను ప్రవేశపెడుతోందని ప్రొద్దుటూరు డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసు గౌస్‌ ఆజాం అన్నారు.

మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ గౌస్‌ ఆజాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, మార్చి 8: తపాలా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అధునాతన పద్ధతులను ప్రవేశపెడుతోందని ప్రొద్దుటూరు డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసు గౌస్‌ ఆజాం అన్నారు. సోమవారం వల్లూరు పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో డీటీఎంల ద్వారా పోస్టాఫీసు సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే ఏ బ్యాంకు నుంచైనా తమ డబ్బులు తీసుకునేందుకు వీలుగా తపాలా శాఖ ఇప్పటికే పోస్టల్‌ బ్యాంకు ఏర్పాటు చేసిందని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమావేశంలో సబ్‌ డివిజనల్‌ హెడ్‌ (ఐపీవో) శ్రీధర్‌, స్థానిక పోస్టుమాస్టర్‌ జాఫర్‌హుసేన్‌, ఎంఎల్‌వో రాజగోపాల్‌, తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T04:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising