ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న చేయూతలో రాజకీయ మతలబు

ABN, First Publish Date - 2021-09-04T05:11:40+05:30

జగనన్న చేయూతలో రాజకీయ మ తలబు చోటు చేసుకుంది. గత ఏడాది ఇచ్చారు.. ఈ ఏడాది తొలగించారు.

ఉల్లితుల రాజమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత ఏడాది ఇచ్చారు.. ఈ ఏడాది తొలగించారు

సంబేపల్లె, సెప్టెంబరు3: జగనన్న చేయూతలో రాజకీయ మ తలబు చోటు చేసుకుంది. గత ఏడాది ఇచ్చారు.. ఈ ఏడాది తొలగించారు. ఇందులో సంబంధిత వలంటీర్‌ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న మహిళా చేయూత పేరుతో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఒక్కో ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాలకు అందించే పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే వలంటీర్‌ రాజకీయ మతలబుతో ఇరువురి పేర్లను జాబితా నుంచి తొలగించారు. సంబేపల్లె మండలం కస్పాకు చెందిన ఉల్లేతుల రాజమ్మను గత ఏడాది జగనన్న చేయూతకు ఎంపిక చేశారు. ఆ ఏడాది ఆమె ఖాతాలో రూ.18,750 జమ చేశారు. అయితే ఈ ఏడాది ఆమె పేరు అర్హుల జాబితాలో కనిపించలేదు. ఆమె పేరుతో ట్యాక్సు చెల్లించినట్లు ఉండటంతో వలంటీర్‌ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అలాగే మరో మహిళ మట్టి లక్ష్మిదేవి పేరు కూడా జాబితా నుంచి తొలగించారు. ఆమె మోతుబరి రైతు అని వలంటీర్‌ పేరును తొలగించినట్లు తెలిపారు. త మ కుటుంబానికి ఉన్న పొలం రెండున్నర ఎకరాలే అని, తా ను ఎలా మోతుబరి రైతు అయ్యానని ఆమె ప్రశ్నిస్తోంది. ఇలా వీరిరువురు అర్హత ఉండి కూడా జగనన్న ఆర్థిక చేయూతకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్‌ తప్పిదాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ విషయమై ఎంపీడీఓ నరసింహులు ను వివరణ కోరగా జాబితా నుంచి తొలగించిన పేర్లు తమ లాగిన్‌లోకి రావ న్నారు. సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ను అడగాలని పేర్కొన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ను వివరణ కోరగా వారి పేర్లను జాబితాలో వలంటీర్‌ తొలగించినట్లు వివరించారు.

Updated Date - 2021-09-04T05:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising