ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల సేవలు అజరామరం

ABN, First Publish Date - 2021-10-22T05:36:43+05:30

శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు అజరామరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ కొనియాడారు. ప్రజల క్షేమం కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మరువలేమన్నారు.

పోలీసు అమరవీరులకు జిల్లా జడ్జి, కలెక్టర్‌, ఎస్పీ నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌

కడప(క్రైం), అక్టోబరు 21: శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు అజరామరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ కొనియాడారు. ప్రజల క్షేమం కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మరువలేమన్నారు. గురువారం నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎస్పీ కేకేఎన అన్బురాజనతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్‌ విజయరామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ పోలీసు అంటే ధైర్యం, భరోసా, నమ్మకమని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు భద్రత కల్పిస్తారన్నారు. అనంతరం ఎస్పీ అన్బురాజన మాట్లాడుతూ అమర వీరులైన వారి ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సంగా జరుపుకుంటున్నామని వివరించారు. జిల్లాలో అమరులైన పోలీస్‌ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. విధి నిర్వహణలో కొవిడ్‌-19 మహమ్మారికి అనువులు బాసిన పోలీసు సిబ్బందికి రూ.10 లక్షల ప్రత్యేక ఆర్థిక సాయం చెక్కులను జిల్లా జడ్జి, కలెక్టర్‌, ఎస్పీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స) ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, ఫ్యాక్షన జోన డీఎస్పీ చెంచుబాబు, దిశ పోలీస్‌ స్టేషన డీఎస్పీ వాసుదేవన, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ రవికుమార్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising