ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు

ABN, First Publish Date - 2021-10-20T05:18:10+05:30

జిల్లాలో ఇసుక, మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు అధికారులు, సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేసి, 12.25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), అక్టోబరు 19: జిల్లాలో ఇసుక, మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు అధికారులు, సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేసి, 12.25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిషేధిత గుట్కాకు సంబంఽధించి రెండు కేసులు నమోదు చేసి 655 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంఽధించి ఒక కేసు నమోదు చేసి, 4 ఆటోలను, అందులో తరలిస్తున్న 6 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

మాస్కులు ధరించనివారికి జరిమానా

జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించని 338 మందిపై రూ.45,895 జరిమానా విధించినట్లు ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య రక్షణ అందరి చేతుల్లో ఉందని, తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. 

Updated Date - 2021-10-20T05:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising