ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-01-21T05:15:11+05:30

అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాణం కాబోతున్న రామమందిర నిర్మాణంలో భారతదేశంలోని ప్రతిఒక్కరూ విరాళాలు అందించి భాగస్వామ్యం కావాలని విశ్వహిందూపరిషత్‌ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు.

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న రాఘవులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీహెచ్‌పీ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు

కడప(మారుతీనగర్‌), జనవరి 20: అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాణం కాబోతున్న రామమందిర నిర్మాణంలో భారతదేశంలోని ప్రతిఒక్కరూ విరాళాలు అందించి భాగస్వామ్యం కావాలని విశ్వహిందూపరిషత్‌ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాగార్జున మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్తీభవించిన ధర్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అని, అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు సుమారు 492 సంవత్సరాలుగా శ్రీరామ భక్తులు నిరంతరం సంఘర్షణ సాగించారన్నారు. గత 36 సంవత్సరాలుగా భక్తులు నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా సమస్త సమాజం లింగ, జాతి, వర్గ, భాష, సంప్రదాయ, ప్రాంత, విభేదాలు వీడి ఏకాత్మ భావనతో శ్రీరామమందిర నిర్మాణమే పరమావిధిగా తలచారన్నారు. ముఖ్యంగా అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామమందిర నిర్మాణానికి ఈ నెల 14 నుంచి ఫిబ్రవరి 22 వరకు దేశవ్యాప్తంగా దాతల నుంచి దానాన్ని స్వీకరిస్తున్నా మని తెలిపారు. పాత్రికేయుల సమావేశానంతరం రామమందిర నిర్మాణంలో తమవంతుగా నగరానికి చెందిన ప్రముఖులు చెక్కుల రూపంలో విరాళాలు అందజేశారు. సమావేశంలో విశ్వహిందూపరిషత్‌ ప్రాంతీయ అధ్యక్షుడు బి.రామకృష్ణారెడ్డి, జిల్లా మఠ మందిరాల ప్రముఖ్‌ నందారపు చెన్నకృష్ణారెడ్డి, వీహెచ్‌పీ నాయకులు రాంమహేశ్‌, చిన్మయమిషన్‌స్వామి చౌనక్‌ చైతన్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising