ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్ల తోటల పరిశీలన

ABN, First Publish Date - 2021-06-18T04:49:08+05:30

మండలంలోని వెంకటరెడ్డిపల్లె గ్రా మంలో పండ్ల తోటలను అనంతరాజుపే ట ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు కె. స్వరాజ్యలక్ష్మీ, సీహెచ్‌ రూత్‌ గురువారం పరిశీలించారు.

అరటి తోటను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్న ప్రొఫెసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, జూన్‌ 17: మండలంలోని వెంకటరెడ్డిపల్లె గ్రా మంలో పండ్ల తోటలను అనంతరాజుపే ట ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు కె. స్వరాజ్యలక్ష్మీ, సీహెచ్‌ రూత్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనస సాగులో కాయకుళ్లు తెగులు సోకిందని తెలిపారు. తెగుళ్లు సోకిన కాయలను తొలగించిన తర్వాత మాంకొజబ్‌ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి చెట్లు ఆకులు, కాయలు, కాడలు, కొమ్మలు బాగా తడిచేటట్లు గా పిచికారీ చేయాలని తెలిపారు. అరటి సాగులో పెరుగుదలలో అసమానతను, కాయ లోపల మధ్య భాగంలో నల్లని మచ్చలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. బోరాన్‌ పోషక లోపాలు, బ్యాక్టీరియల్‌ ఎండు తెగులుతో  ఇలా ఉండవచ్చునని తెలిపారు. నివారణ కోసం బోరాన్‌ రెండు గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలన్నారు.  మామిడిలో పండు ఈగ అధికంగా ఉందన్నారు. మిథైల్‌యూజనాల్‌ వినియోగించే బుట్టలను చెట్ల దగ్గర పెడితే పండు ఈగను నివారణ చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండూరు విజయ్‌, రామరాజు, సయ్యద్‌ కరీమ్‌, ఆర్‌బీకే ఇన్‌ఛార్జ్‌, గ్రామ సర్పంచ్‌ నాయుని హరిక్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T04:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising