ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పుడు వివరాలు ఇచ్చినందుకే ఎన్‌వోసీ నిరాకరించాం : డీడీవో

ABN, First Publish Date - 2021-01-25T04:56:41+05:30

ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ కామనూరు భాస్కర్‌ విద్యుత్‌ మీటరు పొందేందుకు ఎన్‌వోసీకి చేసుకున్న దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇచ్చినందుకే రిజెక్టు చేశామనిగ్రామ పంచాయతీ డీడీవో రామాంజనమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 24: ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ కామనూరు భాస్కర్‌  విద్యుత్‌ మీటరు పొందేందుకు ఎన్‌వోసీకి  చేసుకున్న దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇచ్చినందుకే  రిజెక్టు చేశామనిగ్రామ పంచాయతీ డీడీవో రామాంజనమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. కామనూరు గ్రామంలో తన ఇంటికి విద్యుత్‌ మీటరు పొందేందుకు ఎన్‌వోసీ కోసం  దరఖాస్తు చేసుకోగా సంబందిత లైన్‌మెన్‌ను, వలంటీరును విచారణ చేయాలని తాను ఆదేశించానన్నారు. దీంతో  అతను నివశిస్తున్న ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఉందని విచారణలో తేలిందని, అలాగే అతడి పేరు మీద విద్యుత్‌ పాత బకాయిలు ఉండడంతో ఎన్‌వోసీకి నిరాకరించామన్నారు. దీంతోపాటు అతని భార్య శాంతమ్మకు అంగవైకల్య పింఛను కోసం చేసుకున్న దరఖాస్తుకు జతపరచిన సదరం సర్టిఫికెట్‌లో వివరాలు ఆన్‌లైన్‌లో తాత్కాలికంగా అని రావడంతో అంగవైకల్య పింఛనుకు అర్హత లేదని తాను తెలియపరిచానన్నారు. దీంతో భాస్కర్‌ తాను మాజీ సర్పంచ్‌ నంటూ, తాను ఎస్టీ అని బెదిరిస్తూ  నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె  ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అతని తప్పుడు ఫిర్యాదులపై తమ వద్ద  ఆధారాలు  ఉన్నాయని వాటిని జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఆమె వివరించారు.

Updated Date - 2021-01-25T04:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising