ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకగ్రీవాల కోసం ఎడతెరిపి లేని చర్చలు

ABN, First Publish Date - 2021-02-28T05:05:12+05:30

మున్సిపల్‌, కార్పొరేషన ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ దగ్గరపడే కొద్దీ ఎన్నికల పోరు వేడెక్కుతోంది. వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చనిపోయిన వారి స్థానంలో నామినేషన్ల దాఖలుకు నేడు చివరి రోజు

కడప, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌, కార్పొరేషన ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ దగ్గరపడే కొద్దీ ఎన్నికల పోరు వేడెక్కుతోంది. వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పోటీలో ఉన్న వారిని బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మాట వినని వారిని కొందరు పోలీసుల ద్వారా ఉపసంహరించే యత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప కార్పొరేషన బరిలో ఉన్న అభ్యర్థులను వితడ్రా చేసేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన వేస్తున్న పలువురు అభ్యర్థులతో శనివారం కూడా మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి  మున్సిపాలిటీల్లో కూడా నెలకొన్నట్లు సమాచారం. గత ఏడాది నామినేషన వేసి మరణించిన వారి స్థానాల్లో మరొక అభ్యర్థి నామినేషన వేసేందుకు ఎన్నికల కమిషన మరొక అవకాశం ఇచ్చింది. జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు మరణించారు. ఆయా పార్టీల నుంచి నామినేషన్ల దాఖలుకు ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఇచ్చారు. బద్వేలులో ఒకరు శనివారం నామినేషన దాఖలు చేశారు.

Updated Date - 2021-02-28T05:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising