ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనర్హులకు ‘నేతన్న నేస్తం’

ABN, First Publish Date - 2021-07-22T04:43:44+05:30

మండలంలో అనర్హులతో నేతన్న నేస్తం నిండిపో యిందని పలు ఆరోపణలున్నాయి.

అధికారులకు చూపించే మగ్గం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగ్గం నేయడం రాకున్నా...?

మహానగరాల్లో కాపురం మండలాల్లో లబ్ధి

బి.కోడూరు, జూలై 21: మండలంలో అనర్హులతో నేతన్న నేస్తం నిండిపో యిందని పలు ఆరోపణలున్నాయి. ఇది అక్రమార్కులకు సిరులపంటగా మా రింది. అధికార పార్టీ నేతల సిఫారసు, అధికారుల సహకారంతో పథకంలోకి అక్రమార్కులు చేరి ప్రభుత్వ సొమ్ము ను లూఠీ చేస్తున్నారు. నేతన్నలను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పేరిట ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అయితే బి.కోడూరు మండలంలో మాత్రం మ గ్గం వేయాల్సిన అవసరం, స్థానికంగా లేకున్నా సరే పథకాన్ని మాత్రం యధే చ్ఛగా పొందవచ్చనే ఆరోపణలున్నా యి.

కావాల్సిన వారికి చేతులు తడిపి తే స్కీంలో లబ్ధిదారులవొచ్చనే వాదన లు విన్పిస్తున్నాయి. నేతన్ననేస్తం చిలక్కొట్టు డు వ్యవహారం మండలంలో చర్చనీయాంశం గా మారింది. చేనేతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మగ్గం కార్మికులకు ఏటా రూ.24 వేలు చెల్లిస్తోంది. రామసముద్రం, ఆనంవారి పల్లెలో 133 మంది రైతన్న నేస్తానికి ఎంపికయ్యారు. అయితే వీరిలో సుమారు 40 మంది దాకా బోగస్‌దారులన్న ఆరోపణలున్నాయి.  

మగ్గం రాకున్నా....

నేతన్న నేస్తం పొందుతున్న వారిలో కొందరికి అసలు మగ్గం నేయడమే రాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మగ్గం లేకున్నా కూడా పథ కానికి ఎంపిక చేయడం విమర్శల కు తావిస్తోంది. రామసముద్రం నడిబొ డ్డున ఓ మగ్గాన్ని ఉంచి అధికారులు వచ్చినప్పుడు ఆ మగ్గాన్ని లబ్ధిదారుల ఇంటి వద్ద పెట్టడం, ఫొటోలు తీసుకుం టుంటారనే ఆరోపణలున్నాయి.   లబ్ధి దారులకు ఇది సొంత మగ్గంగా రికార్డు ల్లో నమోదు చేయిస్తుంటారు. 

స్థానికులు కాకున్నా....

నేతన్న నేస్తం లబ్ధిదారుల్లో అనర్హులకు అంద లమెక్కించినట్లు అర్ధమవుతోంది. ఇతర ప్రాం తాల్లో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారు, మిగతా ప్రభు త్వ పథకాలు పొందిన వారిని కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఒక మహిళ కు మగ్గం రాదని, ఆమె ప్రొద్దుటూరులో ఉ న్నట్లు వినికిడి. అంతేకాకుండా భర్త ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. ఇలాంటి వారు   హైదరాబాద్‌, వైజాగ్‌, వంటి మహానగరాల్లో మ రెందరో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లబ్ధి పొందుతున్న అనర్హులను స్థానికులు గుర్తించి ఆధారాలతో ఎంపీడీ ఓకు ఫిర్యాదు చేశారు. సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంటుతో విచార ణ చేయించారు. అయితే అక్రమాలను తొక్కి పెట్టి నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

ఎంపీడీఓ  వివరణ

ఈ విషయమై ఎంపీడీఓ ఉమామహేశ్వర్‌ రావు వివరణ ఇస్తూ అవకతవకలు జరిగి నట్లు తన దృష్టికి వచ్చింది. స్వయంగా ఆ గ్రామాలకు వెళ్లి సమగ్ర విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులకు పథకం అందేట్లు చూస్తాను అని ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-22T04:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising