ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవభారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ

ABN, First Publish Date - 2021-05-28T04:46:22+05:30

స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలిప్రధాని, నవభారత నిర్మాత, భారతరత్న స్వర్గీయ జవహర్‌లాల్‌ నెహ్రూ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కొనియాడారు.

వేంపల్లెలో నెహ్రూ, వీరేశలింగం పంతులు చిత్రపటాలకు నివాళులు అర్పిస్తున్న తులసిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, మే 27: స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలిప్రధాని, నవభారత నిర్మాత, భారతరత్న స్వర్గీయ జవహర్‌లాల్‌ నెహ్రూ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కొనియాడారు. గురువారం వేంపల్లెలో నెహ్రూ 57వ వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ 17 సం వత్సరాలు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారన్నారు. నవ భారత నిర్మాతగా, పంచశీల ప్రబోధకుడిగా, అలీనోద్యమ పితామహుడిగా, పంచవర్ష ప్రణాళికల ప్రాణదాతగా చరిత్ర సృష్టించాడన్నారు. నవభారతావనికి శాస్త్రీయ దృష్టి కల్పిస్తూ, శాస్త్ర, సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని, సాగునీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దార్శనికుడు నెహ్రూ అని శ్లాఘించారు.

వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్త: కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త, స్త్రీజనోద్దారకుడు, తెలుగు భాషోద్దారకుడు అని తులసిరెడ్డి కొనియాడారు. స్వర్గీయ కందుకూరి వీరేశలింగం పంతులు 102వ వర్ధంతి సందర్భంగా వేంపల్లెలో గురువారం తులసిరెడ్డి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, చెన్నకేశవ, నరసింహారెడ్డి, ఉత్తన్న, సత్తార్‌, బద్రి, నాగరాజు, రాఘవయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-28T04:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising