ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ABN, First Publish Date - 2021-04-11T04:39:45+05:30

సేంద్రియ ఎరువుల ద్వారా చేసే ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని జేవీవీ సీఏ రాంమోహన్‌ తెలిపారు.

కషాయాలను తయారు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, ఏప్రిల్‌10:  సేంద్రియ ఎరువుల ద్వారా చేసే ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని జేవీవీ సీఏ రాంమోహన్‌ తెలిపారు. శనివారం సుండుపల్లె గ్రామం వెంగమరాజుగారిపల్లెలో మహిళా గ్రామ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఘనజీవామృతం వంటి కషాయాల ఎరువులు తయారు చేసి పంటలు పండించడం ద్వారా తాజా కూరగాయలతో పాటు భూమి సారవంతం పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడంతో  ఖర్చులు తగ్గి భూమిలో పోషక విలువలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. అనంతరం ఘనజీవామృతం చేసే విధానాన్ని మహిళా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ వీరనాగయ్య, ఆంజనేయులు, ఐసీఆర్‌పీలు, మహిళా రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T04:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising