ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌ మేధావులుగా రాణించాలి

ABN, First Publish Date - 2021-02-28T05:07:44+05:30

నేటి బాల మేధావులు రేపటి శాస్త్రవేత్తలుగా రాణించాలని డిప్యూటీ డీఈఓ రామస్వామి అన్నారు. సర్‌ సీవీ రామన జయంతిని పురస్కరించుకుని జాతీ య సైన్సు దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

నమూనాలను పరిశీలిస్తున్న డిప్యూటీ డీఈఓ రంగస్వామి, హెచఎం ప్రమీల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లూరు, ఫిబ్రవరి27: నేటి బాల మేధావులు రేపటి శాస్త్రవేత్తలుగా రాణించాలని డిప్యూటీ డీఈఓ రామస్వామి అన్నారు. సర్‌ సీవీ రామన జయంతిని పురస్కరించుకుని జాతీ య సైన్సు దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా కమలకూరు జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల ఆధ్వర్యం లో నిర్వహించిన జాతీయ సైన్సు దినోత్సవం లో నమూనాలను పరిశీలించిన ఆయన మా ట్లాడుతూ రామన ఎఫ్టెక్‌ సర్‌ సీవీ రామన దేనన్నారు. ఈ ప్రదర్శనలో సైన్సు ఉపాధ్యాయులు రమణారెడ్డి, నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

గోపవరం, ఫిబ్రవరి 27: విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పధం పెం పొందించుకోవాలని కాల్వపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరజయలక్ష్మి పేర్కొన్నారు.

పాఠశాలలో సై న్స ఉపాధ్యాయులు బాపు, కిష్ణ్రకుమారి ఆధ్వర్యంలో జాతీయ సైన్స దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల చేత పలు ప్రయోగాలు చేయించి వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రిష్ణారెడ్డి, ప్రసాద్‌, రవీంద్రరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.

కాశినాయన ఫిబ్రవరి27: విద్యార్థులు రామనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి పేర్కొన్నారు. నర్సాపురం జిల్లాపరిషత ఉన్న త పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవంలో రామన చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి, బాలఓబయ్య శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

చక్రాయపేట, ఫిబ్రవరి 27: ప్రతి విద్యార్థి డాక్టర్‌ రామనను ఆదర్శంగా తీసు కోవాలని ఎంఈఓ రవీంద్రనాయక్‌ పేర్కొ న్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సంద ర్భంగా విద్యార్థులకు కొత్త కొత్త ప్రయోగా లపై నిర్వహించిన సైన్సఫేర్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల ను ప్రోత్సహించి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. 

Updated Date - 2021-02-28T05:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising