ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎంపై అవగాహన కలిగిఉండాలి

ABN, First Publish Date - 2021-10-20T04:38:41+05:30

తహసీల్దార్లు, మాస్ట ర్‌ ట్రైనర్లు, పోలింగ్‌ సిబ్బంది ఈవీఎంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని బద్వే లు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు.

శిక్షణలో ప్రసంగిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు,అక్టోబరు 19: తహసీల్దార్లు, మాస్ట ర్‌ ట్రైనర్లు, పోలింగ్‌  సిబ్బంది ఈవీఎంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని బద్వే లు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఉప ఎన్నికలపై మాస్టర్‌ ట్రైనర్లు, తహసీల్దార్లకు తహసీల్దారు కార్యాలయంలో, పోలింగ్‌ సిబ్బంది కి బాలుర ఉన్నత పాఠశాలలో వేర్వేరుగా నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ   మాస్టర్‌ ట్రైనర్లు, తహసీల్దార్లు పొరపాట్లకు తావ్వివ్వకుండా  పోలింగ్‌ సరళి ని సజావుగా నిర్వహించాలని సూచించారు.

సిబ్బంది రెండు డోసు ల వ్యాక్సినేషన్‌ తప్పక చేయించుకుని ఉండాలని  పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను వెంట తెంచుకోవాలన్నారు. ఏ చిన్న  అనుమానం ఉ న్నా అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప ఎన్నికల స హాయ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసుల రెడ్డి,  వ్యవసాయ శాఖ స హాయ సంచాలకులు సుబ్బారావు, తహసీల్దార్లు శివరామిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising