ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-06-15T04:52:51+05:30

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయా జిల్లా కార్యదర్శి కె.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట అందోళన చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు, జూన్‌ 14 : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయా జిల్లా కార్యదర్శి కె.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీయూ అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎం ప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట  కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ  మాట్లాడుతూ  ఎన్నికల ప్రచారాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని, కనీస వేతనం రూ.24వేలు ఇస్తానని హమీ ఇచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికి ఆహామీని నిలటెట్టుకోలేదన్నారు. ఏదాడి కాలంగా మున్సిపల్‌ కార్మికులు  శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించి, అధికారులకు, పాలకులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేక పోవడంతో ఆందోళన తీవ్రతరం చేయాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి విజయకుమార్‌, నాయకులు చంటి, రాఘవ, రవి, గరుర్రమ్మ, రమణమ్మ, రమాదేవి, ప్రమీలమ్మ, ఆరుణ్‌, సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 14: కరోనా, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల జీవితం అగమ్యగోచరంగా మారిందని ఇలాంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాల ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏరి యా కార్యదర్శి యేసోబు డిమాండ్‌  చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం సంఘం కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20.60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి ప్రభుత్వం గుర్తింపుకార్డులు కూడా ఇచ్చిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.  కరోనాతో పనులు లేక ఇళ్లు గడవ 45 మంది కార్మికులు రాష్ట్రం లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  55 సంవత్సరాలు దాటిన కార్మికులకు పింఛన్‌ మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుధాకర్‌, ఉపాధ్యక్షులు శేషారెడ్డి, సహాయ కార్యదర్శులు బాబు, కుమార్‌, ఇషాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T04:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising